రామో విగ్రహవాన్ ధర్మః
కోస్వస్మిన్ సాంప్రతం లోకే? గుణవాన్? కశ్చ
వీర్యవాన్?
ధర్మజ్ఞశ్చ? కృతజ్ఞశ్చ? సత్యవాక్యో? దృఢవ్రతః?
చూరిత్రేణ చకో యుక్తః? సర్వభూతేషు కోహితః?
................. కశ్చైక ప్రియదర్శనః?
ఆత్మవాన్ కో? జితక్రోధో?
ద్యుతిమాన్? కో7న సూయకః?
ఇవన్నీ ప్రశ్నలు, ఈ ప్రశ్నల కన్నిటికీ ఉత్తరం ఒక్కటే! అది--
''ఇక్ష్వాకు వంశప్రభువో రామోనామ జనైశ్ర్శుతః|'' అని వాల్మీకి మహం 'కః ధర్మజ్ఞః ్స ధర్మజ్ఞు డెవరు?' అని ప్రశ్నించిన వాల్మీకి మహం దర్మాచరణకు వాల్మీకి మతంలో రెండు ప్రధాన గుణములు. ఒకటి ధృతి, రెండవది నియమము- అవసరము, శ్రీరామచంద్రుడు తనతండ్రి ఇచ్చ మేరకు అరణ్యవాసమునకై బయలుదేరుతూ తల్లి ఆశీస్సులకై కౌసల్య వద్దకు వెళ్లినమస్కరించాడు ఆమె ఇట్లు దీవించింది-
యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ
నియమేన చ|
సవై రాఘవ శార్దూల| ధర్మస్త్వా మభిరక్షతు||
ఇందు తల్లి 'ధర్మంచర' ధర్మమార్గములో సంచరించు అని ఉపదేశించలేదు. ధర్మమే రాముని శీలము. స్వాభావికముగా రాముడు ధర్మరక్షకుడు. ఈ విషయం ఆమెకు తెలిసినదే. అందుచేత ఆమె పరోక్షముగా ధృతి నియమముల ఆవశ్యకతనుగూర్చి తెలుపుతూ 'రాఘవా! నీవు ధైర్యముతో నియమముతో ఏ ధర్మమును ఆచరిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక!' అని అన్నది. 'ధృతి' అనగా ధైర్యము. నియమము అనగా కట్టుబాటు. ధర్మపథంలో నియమము, ధృతి అత్యవసరములు.
6-16)
ప్రతి భారతీయునకు రాముని శీలమే లక్ష్యం. ప్రతి భారతీయునకు రామనామమే మహామంత్రం. మనలను పీడించే రుజావైవిధ్యానికి. రామానామామృతమే మందు.
మనకు కావలసినది రామరక్ష. రాముడు ధర్మస్వరూపి. 'రామో విగ్రహవాన్ ధర్మః' ధర్మాచరణకు అవసరమైన ధృతి నియమములను రామనామామృతమే మనకు ఇయ్యగలదు.
|